morning walk clicks !



రోజూ పొద్దున్నే నే వాకింగ్ కి వెళ్ళేదారిలో ఒక కాలనీ వస్తుంది. వాళ్ల గేట్ బయట తోటలో గులాబీలు పెంచుతున్నారు. ఎరుపు, క్రీం, లేత గులాబీ రంగుల్లో ఉండే ఆ గులాబీలు కొమ్మ కొమ్మకీ బోలెడు పూసేసి చూసే కొద్దీ ఇంకా ఇంకా చూడాలనే ఉంటాయి. కొన్ని ఫోటోలు...

అన్నీ మొబైల్ cameraతో తీయటం వల్ల కొన్ని ఫోటోల క్లారిటీ సరిగ్గా లేదు...











గోరింట మొక్క

గోంగూర పువ్వు



 సీతాకోకచిలుక

కొద్దిగా రంగు మార్పుతో మరో సీతాకోకచిలుక

ఎడంపక్కన మూలన ఉన్న చిన్న సీతాకోకచిలుక కనబడుతోందా?

ముళ్ల చెట్టుకు నీలి పువ్వు పూసిందా?

 ఇదేం పువ్వో..


చిన్న గడ్డిపువ్వు..


రోకలిబండల పుట్ట



రోకలిబండల పుట్ట ..మరొకటి!



7 comments:

Unknown said...

గడ్డిపువ్వు పైన ఉన్నది ఒక రకమైన పాసన్ ఫ్లవర్( ఫ్రూట్)తెలుగులో కౌరవపాండవ పూలు అంతారు. గుంటూరులో మా ఇంట్లో ఉండేది.

సిరిసిరిమువ్వ said...

మీకు పొద్దుట వాకింగుతో పాటు నయనానందం కూడా అన్నమాట. పువ్వులు బాగున్నాయి. మీరు అడిగిన పువ్వు పేరు జూకా మందారం..పాండవులు-కౌరవులు పువ్వు అని కూడా అంటారు. ఇంగ్లీషులో passion flower అంటారు.

ఆ రోకలిబండలు మాకు ఇక్కడ విపరీతం..ఇంట్లోకి సైనికుల్లా మార్చ్ ఫాస్టు చేసుకుంటూ వచ్చేస్తాయి..రోజులో సగం సేపు వీటిని బయటకు ఊడ్చటమే నా పని అయిపోయింది.

తృష్ణ said...

@సునీతగారూ, చాలా చోట్ల చూశాను కానీ ఈ పువ్వు పేరు తెలీదు. థాంక్సండి.

@మువ్వ గారూ, పువ్వు పేరు పైన సునీత గారు కూడా చెప్పారు. తెలుగు పేరు విచిత్రంగా ఉంది.
రోకలి బండలు పుట్టలు పుట్టలుగా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఉండేవి. మళ్ళీ ఇన్నాళ్లకి ఇక్కడ చూస్తున్నా.
నేను స్కిప్ చెయ్యకుండా వాకింగ్ కి వెళ్ళటానికి ఈ పువ్వులు,మొక్కలు, రంగురంగుల సీతాకోకచిలుకలు కూడా ఒక కారణం. రోజూ ఈ సీతాకోకచిలుకలను ఫోటో తీద్దామనేలోపూ ఎగిరిపోతూ ఉంటాయి..:)
ధన్యవాదాలు.

చిలమకూరు విజయమోహన్ said...

fashion fruit!Enriched with vitamin C
జ్యూసు చేస్తారు.

తృష్ణ said...

@vijay mohan gaaru, పైన passion flower అన్నారు సిరిసిరిమువ్వగారు.. ఏది కరక్ట్?
thanks for the visit.

చిలమకూరు విజయమోహన్ said...

passion flower సరి అయినది నేను తప్పు టైపు చేసా.passion fruit enriched with vit C

తృష్ణ said...

thanks vijayamohan gaaru.