క్రితం వారం ఓ సందులోంచి నడుచుకు వెళ్తూంటే రేకమాలతి పూల వాసన గుప్పుమంది. ఎక్కడా అని వెతికితే..ఓ గోడ మీంచి ఇలా ఓ పేద్ద చెట్టు పైకి పాకిన రేకమాలతితీగ కనబడింది.
అద్భుతమైన సువాసనలు వెదజల్లే ఈ రేకమాలతి మా తాతగారింట్లో ఉండేది. వర్షం కురిసిన రాత్రి బయటకు వచ్చి నిలుచుంటే మెట్ల నిండా రాలిన ఆ తెల్లనిపూలు, ఆ పరిమళం, ఆ మట్టి వాసన అస్సలు మర్చిపోలేను..
మత్తెక్కించే ఈ పూల పరిమళం ఎంత బాగుంటుందో...
విచిత్రమైన ఫల్లాలతో ఉన్న ఈ చెట్టు ఏం చెట్టో నాకు తెలీదు...ఎవరైనా చెప్పగలరా?
13 comments:
నేనిదే మొదటిసారి ఈ తీగని చూడటం.. :( పేరు భలే ఉంది, చూడటానికి కూడా చాలా బావున్నాయి..
తృష్ణ గారూ మొదటి సారి "ఇదేం మొక్క?" అని మీరు అడగడం చూశాను. :))
కదంబ వృక్షం అంటారు. లలిత దేవిని ఈ పూలతొ అర్చిస్తారు. కదంబవనవాసిని అని అమ్మవారికి లలిత సహస్రం లో ఒక నామం ఉన్నది, అందుకే ఈ వృక్షాన్ని దేవత వృక్షాలలో ఒకటిగా పూజిస్తారు. బృందావనం (మధురలో) కృష్ణుని కదంబ పూలమాలతో అలంకరిస్తారు. ఈ పువ్వు ఆకుపచ్చదనం పోయి తెల్లగా మారిన తరువాత కోసి చుడండి అందులో చిన్న చిన్న పూలు చాలా ఉంటాయి.. అవన్నీ కలసి చూడడానికి బంతి లా చాలా గమ్మతుగా ఉంటుంది...
@మధురవాణి: రేక మాలతి లాగే, గిన్నెమాలతి అని కూడా ఒక పూతీగె ఉండి మధురా. ఆ పువ్వులు గిన్నె ఆకారంలో ఉంటాయి. మా ఇంట్లో చిన్నప్పుడు ఉండేది అది.
thank you.
@శంకర్.ఎస్: :((
thank you.
@కల్యాణి: 'కదంబకుసుమప్రియా...'అనీ, "కదంబ మంజరీక్లుప్త.. " అనీ వస్తుంది కదండి ఇదేనా అయితే...చాలా థాంక్స్ అండీ.
ఇప్పుడే చూస్తున్నా దీన్ని! దీని గురించేనా ఆ మధ్య సత్యవతి గారు "కొండమల్లె" అని రాశారు? అవి కూడా ఇలాగే ఉన్నాయి.
ఇప్పుడే బజ్ లొ రాసాను. ఇక్కడ కల్యాణి గారూ చెప్పారు.అవి ఫలాలు కాదండీ, రేపు విచ్చుకుంటాయి లేదా, విడటం ఐపోయి ఉంటుంది. పెద్ద చెట్టే కదా? కదంబ చెట్టు. కదంబ పుష్పాలు.
గిన్నె మాలతి తెలుసు కాని..ఈ రేక మాలతి..పేరు వినటం ..చూడట ఇదే మొదటిసారి. హైదరాబాదులో ఎక్కడో చెప్పండి..ఒకసారి వెళ్ళి చూసొస్తా:)
సుజాత గారూ, సత్యవతి గారు పెట్టింది కాగడా మల్లె అనుకుంటానండి..దానినే ఆవిడ కొండ మల్లె అన్నారనుకున్నా నేను. అది చెట్టు కదా! ఇదేమో తీగ అంటున్నారుగా తృష్ణ గారు.
@సుజాత: మువ్వ గారు అన్నట్లు అది వేరే అయిఉంటుందండీ...నాకు తెలిసీ ఈ పూలను రేకమాలతి అనే అంటారు. ఇది పూతీగె.
@సునీత: అయితే మళ్ళీ వెళ్ళి ఎ కాయలులాంటివి విచ్చుకుంటే ఎలా ఉంటాయో చూసి రావాలి.
@సిరిసిరిమువ్వ: మా తాతగారింట్లో గేటు మొదలుకుని పై గుమ్మందాకా పది పదిహేను మెట్లు, వాటిపై టాప్ లాగ ఉన్న పందిరికి పాకించిన ఈ రేకమాలతి తీగ ఉండేది. గాలి గట్టిగా వీస్తే పూలన్నీ మెట్లపై రాలి చూట్టానికి ఎమ్టో అందంగా, మత్తైన సువాసనతో ఉండేది. ఇప్పుడు ఆ ఇల్లు లేదు కానీ ఆ పూలు, ఆ సువాసన తాలూకు స్మృతులు ఇంకా తాజాగానే అనిపిస్తాయి నాకు. ఎడ్రస్ చెప్తాలెండి..:))
మా ఇంటి డాబామీదకి పాకించామండీ ఈ తీగని :) తెగ పూలు పూస్తుందిలే! ఆ కింద ఉన్న చెట్టేదో వెలక్కయకి కజిన్ సిస్టర్ లాగా ఉంది ;)
@ఇందు: వావ్..మీ ఇంట్లో ఉందా? అయితే ఫోటోలు పెట్టు.
ఆ చెట్టు కదంబవృక్షమని పైన కల్యాణి గారూ, సునీత గారూ చెప్పారు.
బాగున్నాయండి...
నేనెప్పుడు చూడలేదు..కాస్త ఒంటి రేకు నందివర్ధనం పూల లాగ కనిపిస్తున్నాయి...
ee teega ekkada dorukutundi? nenu penchutanu..cheppandi plz....
శ్రీదేవి గారూ, నాకూ తెలీదండి...నర్సరీల్లో అడిగి చూడండి..
Post a Comment